FbTelugu

అధ్యక్షుడిని ఎన్నుకోలేని మీరు… అవిశ్వాసం పెడతారా?

తూర్పారబట్టిన సీఎం పినరయ్ విజయన్

తిరువనంతపురం: కేరళ సీఎం పినరయ్ విజయన్ కాంగ్రెస్ పార్టీని తూర్పరబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోలేని, మా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతారా అంటూ ఆయన మండిపడ్డారు.

సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడీ.సతీషన్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెటగా, స్పీకర్ చర్చకు అనుమతించారు. చర్చను ప్రారంభించిన సతీషన్ మాట్లాడుతూ, బంగారం స్మగ్లింగ్ మాఫియా తన కార్యకలాపాను నిర్వహించుకునేందుకు సీఎం కార్యాలయాన్నే ఉపయోగించుకున్నదన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతుందని ఆయన విమర్శించారు. ఈ చర్చకు స్పందించిన సీఎం విజయన్ కాంగ్రెస్ కు గట్టి సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే విశ్వాసం లేదని, ఇవ్వాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేవంలో బట్టబయలు అయిందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు బీజేపీతో కుమ్మక్కు అయ్యారని రాహుల్ ఆరోపించారన్నారు. ఇలా కుమ్ములాడుకుంటూ పార్టీ నేతను ఎన్నుకోలేని దుస్థితిలొ కొట్టుమిట్టాడుతున్నారని విజయన్ ధ్వజమెత్తారు.

You might also like