FbTelugu

వీల్ చైర్ లోనే నా ప్రచారం: మమత

కొలకతా: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం మమతా బెనర్జీ వీడియో సందేశం ఇచ్చారు. వీల్ ఛైర్ లో కూర్చుని ప్రచారం చేస్తానని, ప్రజలు సంయమనం పాటించాలని ఆమె కోరారు.

ఆసుపత్రి వైద్యులు నిరంతరం తనను పర్యవేక్షిస్తున్నారని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జీ అయి బయటకు వస్తానని మమతా బెనర్జీ ప్రకటించారు. తన ఎడమ కాలి మడమ ఎముకకు, పాదానికి, మోకాలికి గాయమైందన్నారు. ఛాతిలో నొప్పి ఉందని, శ్వాస తీసుకోవడానికి అవస్థలు పడుతున్నానని తెలిపింది. డిశ్చార్జీ అయి బయటకు రాగానే వీల్ చైర్ లో కూర్చుని రాష్ట్రంలో ప్రచారం చేస్తానన్నారు. నందిగ్రామ్ లో నామినేషన్ వేసిన తరువాత ఒక ఆలయం సందర్శించిన సమయంలో మమత కాలికి గాయమైన విషయం విదితమే. ఈ ఘటనపై టీఎంసీ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.