FbTelugu

ఆర్వోను చంపుతామని బెదిరింపు: మమతా

కొలకతా: నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటమిపై సవాలక్ష సందేహాలు, అనుమానాలు ఉన్నాయని సిఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
నందిగ్రామ్ లో తను గెలచినట్లు గవర్నర్ జగదీప్ ధన్కర్ అభినందనలు చెప్పారని, ఆ తరువాతి పరిణామాలు తనకు విస్మయం కలిగిస్తున్నాయన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తవుతున్న సమయంలో కంప్యూటర్ సర్వర్ అకస్మాత్తుగా నాలుగు గంటల పాటు డౌన్ అయ్యిందని ఆమె అన్నారు.

తమ పోలింగ్ ఏజెంట్లు రీకౌంటింగ్ కు డిమాండ్ చేస్తే, అలా చేస్తే తన ప్రాణానికి ముప్పు ఉంటుందని రిటర్నింగ్ అధికారి (ఆర్వో) చెప్పారు. రీ కౌంటింగ్ కు అనుమతించవద్దని ఆర్వోను బిజెపి నేతలు బెదించారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ఆర్వో తన స్నేహితులు, సహచర అధికారులకు చెప్పారన్నారు. ఈ విషయాన్ని తనకు ఒకరు మెస్సేజ్ చేశారన్నారు. నందిగ్రామ్ లో తొలుత గెలుపు, ఆ తరువాత ఓటమిపై న్యాయం కోర్టును ఆశ్రయించనున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు.
శాసనసభా పక్షం నేతగా…
మమతా బెనర్జీ టిఎంసి శాసనసభా పక్షం నేతగా ఇవాళ ఎన్నికయ్యారు. మే 5వ తేదీన ఆమె మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ మరుసటి రోజే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.