FbTelugu

గవర్నర్ అవినీతిపరుడు: మమత

కొలకతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ అత్యంత అవినీతి పరుడు అని సిఎం కుమారి మమతా బెనర్జీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనను తొలగించాలని కేంద్రానికి మూడు లేఖలు రాశానని ఆమె తెలిపారు.

ఛార్జ్ షీట్లు ఉన్న వ్యక్తిని గవర్నర్ గా ఎలా నియమిస్తారని ఆమె ప్రశ్నించింది. కొలకతాలో సోమవారం మమత మీడియాతో మాట్లాడుతూ, ఆయనను పదవి నుంచి తీసేయాలని మూడుసార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. 1996 లో హవాలా జైన్ కేసులో ఆయనపై ఛార్జ్ షీట్లు ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత బెంగాల్ లో చెలరేగిన అల్లర్లపై గవర్నర్ తప్పుడు నివేదికలు పంపిస్తున్నందున గవర్నర్ ను వెనక్కి తీసుకోవాలని మమత గతంలో డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులాగా పరిస్థితి ఉంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బెంగాల్ లో పర్యటించేందుకు రాగా హెలీకాఫ్టర్ ల్యాండ్ అయ్యేందుకు మమతా అనుమతించలేదు. ఇలా పలు విషయాల్లో గవర్నర్, సిఎం మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.