FbTelugu

సిఎం కేజ్రీవాల్ కఠిన నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ కేసులు వేగంగా వ్యాప్తిచెందడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సిఎం కేజ్రీవాల్ నిర్ణయించారు.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించారు. ఈ రోజు నుంచే ప్రారంభించి నెలాఖరు వరకు కొనసాగించనున్నారు. సోమవారం నాడు 3548 పాజిటివ్ కేసులు రాగా, 15 మంది చనిపోయారు. ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ లాక్ డౌన్ విధించడం లేదని, ప్రజాభిప్రాయం మేరకు రాత్రపూట కర్ఫ్యూ విధిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. అయితే కర్ఫ్యూ కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆపడం లేదని, రవాణాకు అడ్డంకులు లేకుండా ఈ పాస్ లు ఇస్తున్నామన్నారు. అదే విధంగా నిత్యావసర సరకులు, రేషన్ సరకులు, కూరగాయలు, పాలు, మందులు సరఫరా చేసే వారికి కూడా పాస్ లు ఇస్తున్నామని తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, నర్సులు, జర్నలిస్టులకు పాస్ లు అందచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

గర్భిణీ మహిళలకు కర్ఫ్యూ నుంచి మినహాంపునిచ్చామన్నారు. నైట్ కర్ఫ్యూ విషయాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు, ఢిల్లీ వచ్చే వారు పరిగణనలోకి తీసుకుని తమ ప్రయాణాలు ఖరారు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. సాధారణంగా ఢిల్లీ మెట్రో పాలిటన్ నగరం కావడంతో రాత్రి 12 వరకు వ్యాపారాలు కొనసాగుతుంటాయి. 24 గంటలూ విమానాల రాకపోకలు కొనసాగుతుంటాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.