FbTelugu

థర్డ్ వేవ్ తథ్యం… కొట్టిపారేయవద్దు: సిఎం కేజ్రివాల్

న్యూఢిల్లీ: దేశానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందని, ఈ వార్తను కొట్టిపారేయవద్దని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేసులు తగ్గుముఖం పట్టడంలో ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నామన్నారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, థర్డ్ వేవ్ వస్తుందన్న సమాచారం ఉండడం, వైద్య నిపుణుల హెచ్చరికలతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు.

సెకండ్ వైవ్ పై పోరాటంలో పౌరులు సహకరించడంతో తొందరగానే ఆ గండం నుంచి గట్టెక్కామన్నారు. యుకె లో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే థర్డ్ వేవ్ తథ్యమని అనిపిస్తోందని, ఈ పరిస్థితుల్లో చర్యలు తీసుకోకుండా ఖాళీగా కూర్చోలేమని కేజ్రివాల్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.