హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూఢిల్లీ బయల్దేరారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం పయనమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో పాటు పలువురు మంత్రుల అప్పాయింట్ మెంట్ లభించింది.
ఈ పర్యటనలో కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై నరేంద్ర మోదీతో చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్రసింగ్ షెకావత్, హర్దీప్సింగ్ పురి, నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్ కలిసి వినతి పత్రాలు అందచేయనున్నారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాలు, విపక్షాల నేతలతో కేసీఆర్ సమావేశవుతారని అంటున్నారు. అలాగే ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలించి శంకుస్థాపనపై నిర్ణయం తీసుకుంటారు. కేసీఆర్ వెంట ఆర్ అండ్ బీ మంత్రి వి.ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.