FbTelugu

కల్నల్ కుటుంబానికి కేసీఆర్ పరామర్శ

సంతోషికి రూ.4 కోట్లు, తల్లితండ్రులకు రూ.1 కోటి

జూబ్లీహిల్స్ లో 711 చ.గజాల స్థలం

గ్రూప్-1 అధికారిగా నియామక పత్రం అందచేత

సూర్యాపేట: విద్యానగర్ లో దివంగత కల్నల్ బి.సంతోష్ బాబు చిత్ర పటానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట చేరుకున్న సీఎం నేరుగా కల్నల్ నివాసానికి వెళ్లారు.

మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కల్నల్ భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్ తో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తరువాత పిల్లలు అభిగ్న, అనిరుధ్ తేజలతో మాట్లాడారు. సరిహద్దు గల్వాన్ లోయలో  జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.

దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని సీఎం కొనియాడారు. ఆయన మరణం తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా వుంటుందని హామీ ఇచ్చారు.

kcr interacts santosh wife

సంతోషికి కి రూ.4 కోట్ల చెక్, తల్లిదండ్రులకు రూ.1 కోటి చెక్కును సీఎం అందచేశారు. ఆమెకు బంజారాహిల్స్ లో 711 చదరపు గజాల స్థలానికి సంబంధించిన పత్రాలు, గ్రూప్-1 ఆఫీసర్ నియామకపు పత్రాన్ని కూడా  అందచేశారు.ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని కేసీఆర్ కుటుంబ సభ్యులకు  చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ఆదేశించారు.

You might also like