FbTelugu

కెసిఆర్ కు కరోనా పాజిటివ్: సోమేష్ కుమార్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యిందని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారని ఒక ప్రకటనలో  వెల్లడించారు

సిఎం ఆరోగ్యం నిలకడగా ఉందని, హోం ఐసోలేషన్ సరిపోతుందని వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి.రావు తెలిపారు. సోమజిగూడా యశోద ఆసుపత్రిలో అన్ని అత్యవసర ఏర్పాట్లు చేశామని, ఇప్పటికైతే ఆందోళన అవసరం లేదన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఆకాంక్షించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.