FbTelugu

రేపే పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం (పిఆర్సి) పై సోమవారం నాడు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సిఎం కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించనున్నారు.

గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సిఎం మాట్లాడుతూ… ఒకటి రెండు రోజుల్లో బడ్జెట్ పై చర్చ సందర్భంగా పిఆర్సి ప్రకటన చేస్తానని ఆయన తెలిపారు. సోమవారం నాడు అసెంబ్లీలో బడ్జెట్ పై సమాధానం ఇచ్చే సమయంలో ఈ ప్రకటన చేయనున్నారు. సిఎం సూచనప్రాయంగా చెప్పినట్లుగా పిఆర్సి 30 శాతం వరకు ఇచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు భావిస్తున్నారు. ఎంత శాతం ఇస్తే ఎంత భారం పడుతుందనే దానిపై ఆర్థిక శాఖ ఇప్పటికే లెక్కలు వేసి సిఎం కు అందచేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.