FbTelugu

పారాసిటమల్ తో కరోనా తగ్గింది: కెసిఆర్

వరంగల్: తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని, పారసిటమల్ వేసుకుంటే తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారని సిఎం కెసిఆర్ తెలిపారు. పారాసిటమల్ మాత్రలు వేసుకోవడంతో తగ్గిపోయిందని ఆయన వెల్లడించారు.

ఇవాళ వరంగల్ నగరంలో పలు అభివృద్ధి పనులను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కరోనా వైరస్ పై మాట్లాడారు. కరోనా పాజిటివ్ వస్తే అంతగా భయపడాల్సిన అవసరం లేదని కెసిఆర్ తన స్వీయ అనుభవాన్ని ప్రజలతో పంచుకున్నారు. కరోనా వస్తే జ్వరం వచ్చి శరీరం వేడి అవుతుందన్నారు. కరోనాపై దుష్ప్రచారం తగదని, దీనికి మందు లేదన్నారు. తనకు కూడా సోకగా పారాసిటమల్ వేసుకుంటే చాలని డాక్టర్ చెప్పగా, అదే విధానాన్ని పాటించి తగ్గించుకున్నానని సిఎం కెసిఆర్ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.