FbTelugu

నగరంలో నాలుగు హాస్పిటళ్లు: సిఎం కెసిఆర్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ తో పాటు మరో మూడు సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను నిర్మాణం చేయాలని మంత్రి మండలి తీర్మానం చేసింది. ఇవాళ సిఎం కెసిఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది.
గచ్చిబౌలి లోని టిమ్స్ ను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తూ దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరించనున్నారు. దానికి తోడుగా ఇంకా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని, మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మంత్రి మండలి ఆమోదించింది. వీటిలో ఒకటి ఎర్రగడ్డ ఛాతి వైద్యశాల ప్రాంగణంలో, ఖాళీగా ఉన్న గడ్డి అన్నారం ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో, మేడ్చెల్ జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మరోటి కలిపి మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్లను అభివృద్ధి చేయనున్నారు.

కొత్తపేట లో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని తీర్మానించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు, కరోనా కష్టకాలంలో కూడా ధాన్యం సేకరణను రికార్డు స్థాయిలో నిర్వహించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధి, సంబంధిత శాఖల అధికారులను సిబ్బందిని అభినందించింది. చేనేత, గీత కార్మికులకు త్వరితగతిన బీమా పథకం అందించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మత్స్య కార్మికులకు, గీత కార్మికులకు అందించాల్సిన ఎక్స్ గ్రేషియా ను వెంటనే విడుదల చేయాలని సంబంధిత శాఖలను సూచించింది. వివిధ వృత్తి కులాలకు సంబంధించిన ఎంబిసి కార్పొరేషన్ కు నిధులు విడుదల చేయాలని మంత్రి మండలి తీర్మానం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.