FbTelugu

కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా

హైదరాబాద్: ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటీవ్ ఉండడంతో అక్కడ పర్యటించి, ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం నిశ్చయించుకోగా.. తాజా పరిస్థితుల్లో సిఎం పర్యటన వల్ల సమస్యలొస్తాయని అధికారులు తెలిపారు. పర్యటన మూలంగా అక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న స్క్రీనింగు, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం ఉంటుందన్నారు. కరీంనగర్ జిల్లా యంత్రాంగం, వైద్యశాఖ ఉన్నతాధికారులు, ప్రధాన కార్యదర్శి తదితరుల సూచనల మేరకు సీఎం పర్యటన వాయిదా పడింది.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More