FbTelugu

ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్: కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ ఫిట్ మెంట్ తాత్కిలిక, కాంట్రాక్టు, దినసరి హోం గార్డులకు కూడా వర్తిస్తుందని తెలిపారు.

ఇవాళ అసెంబ్లీలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతున్నామని, తక్షణమే అమలులోకి వస్తుందన్నారు. కొత్త పీఆర్సీ ఏప్రిల్ 1, 2021 నుంచి అమలు చేస్తామన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా వేతన సవరణ సంఘం సిఫారసులు అమలు చేయడంలో ఆలస్యమైందన్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసుకునేలా బదిలీ చేసుకునేందుకు అనుమతిస్తున్నామన్నారు. అదే విధంగా టీచర్ల అంతర్ జిల్లాల బదిలీలకు అనుమతిస్తున్నామని కెసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో 9,17,417 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.