అమరావతి: ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో అక్కడే సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ వెంట మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని పాల్గొననున్నారు.