FbTelugu

దశాబ్ధ పార్టీపై సీఎం జగన్ భావోద్వేగం

తాడేపల్లి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా వైసీపీ ఆవిర్భవించిందని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి భావోద్వేగం వ్యక్తం చేశారు. వైసీపీ స్థాపించి పదేళ్లు పూర్తయి 11వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు.

విశ్వసనీయత, విలువలకు విశ్వమే అండగా నిలుస్తుందని చాటి చెప్పి.. ఈ సిద్ధాంతాలే ఊపిరిగా ప్రజా క్షేత్రంలో పురుడు పోసుకున్నదని అన్నారు. పదేళ్ల ప్రయాణంలో కష్టసుఖాల్లో తనకు అండగా నిలిచిన ప్రజలకు, కలిసి నడిచిన నాయకులకు, వెన్నంటి ఉన్న కార్యకర్తలకు జగన్‌ ధన్యవాదాలు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.