FbTelugu

11న ఈడీ కోర్టుకు సీఎం జగన్

అమరావతి: ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని జగన్ కు ఆదేశించింది.

అరబిందో, హెటిరో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపుల చార్జిషీట్ ను ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ చేశారు. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ను విచారణకు ఈడీ కోర్టు స్వీకరించింది. వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి,  హెటిరో  డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు పంపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.