FbTelugu

కోవిడ్‌ –19 పై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం వైఎస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మోపిదేవి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్‌ హాజరయ్యారు.

గడచిన 24 గంటల్లో 82 కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకూ 80,334 పరీక్షలు చేయించామని అధికారులు తెలిపారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1504 చొప్పున పరీక్షలు చేయిస్తున్నామన్నారు.

పాజిటివ్‌ కేసుల సగటు దేశం మొత్తం 4.13 శాతం అయితే, ఏపీలో 1.57శాతం అని, అలాగే డెత్‌రేటు దేశం మొత్తం 3.19 శాతం అయితే ఏపీలో 2.46 శాతం అని వెల్లడించారు. ఈకేసులన్నీ కూడా కంటైన్‌మెంట్‌ జోన్లనుంచే వస్తున్నాయన్నారు. టెలిమెడిసిన్‌లో భాగంగా వైద్యం తీసుకుంటున్నవారికి మందులు కూడా సరఫరాచేసే విధానం సమర్థవంతంగా ఉండాలని సీఎం సూచించారు.

మొక్కజొన్న, శెనగ, ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీయడంతో పాటు బత్తాయి, అరటి రైతుల సమస్యలపైనా చర్చించారు. బయట రాష్ట్రాల్లో మార్కెట్లు తెరిచారా? లేదా? మన రాష్ట్రం నుంచి అక్కడకు రవాణా అవుతుందా? లేదా? అక్కడ విక్రయాలు ఎలా ఉన్నాయి? వాటి ధరలతో ప్రతిరోజూ సమీక్షా సమావేశానికి వివరాలతో రావాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులన్నీ బయట రాష్ట్రాలకు ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుందన్న సీఎం, దీనిపై పత్యేక దృష్టిపెట్టాలన్నారు.

You might also like