FbTelugu

ఆయుర్వేద మందుపై జగన్ సమీక్ష?

అమరావతి: కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా ఆయుర్వేద మందుకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. పంపిణీ చేస్తానని స్థానిక వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి, వీలు లేదని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరస్పరం వాదించుకున్నారు.

అయినా ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోకుండా తనకు ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ కృష్ణపట్నం లోని ఆనందయ్య తోటలో మందు పంపిణీ చేయిస్తున్నారు. అయితే ఈ మందు పంపిణీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ అనుమతిస్తే ప్రభుత్వపరంగా చేయాల్సిన ఏర్పాట్లపై సిఎం ఆదేశాలు ఇవ్వనున్నారు.

covid patients

సిలిండర్లు, అంబూలెన్స్ లలో పరుగులు…

పలు ఆసుపత్రులలో మంచాలు ఖాళీ చేసి ఆక్సిజన్ సిలిండర్లు వెంటబెట్టుకుని, అంబూలెన్స్ లలో, కార్లలో వేలాది మంది కరోనా బాధితులు ఇక్కడకు చేరుకుంటున్నారు. అనుమతులు వచ్చేంతవరకు ఆయుర్వేద మందు పంపిణీ చేసేందుకు వీలు లేదని నెల్లూరు  జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు నిలిపివేశారు. బాధితుల కోసం మందు పంపిణీ చేసి తీరుతాం అని స్థానిక వైసిపి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. మందు పంపిణీ పై జిల్లా కలెక్టర్  వద్దని, స్థానిక ఎమ్మెల్యే కావాలని పట్టుబడుతుండడంతో కృష్ణపట్నం ఉత్కంఠభరితంగా మారింది. మందు పంపిణీ  కోసం కృష్ణపట్నంలోని ఆనందయ్య తోట లోకి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి చేరుకున్నారు. కృష్ణపట్నం మొత్తం వాహనాలు, అంబూలెన్స్ లు, కరోనా బాధితులతో నిండిపోయింది. సుమారు పదివేల మంది వరకు కరోనా బాధితులు చేరుకున్నారు.

hospital wards

You might also like

Leave A Reply

Your email address will not be published.