FbTelugu

అంతర్వేది రథాన్ని ప్రారంభించిన జగన్

తూ.గో. జిల్లా: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం వైఎస్.జగన్‌ దర్శించుకున్నారు. సీఎం జగన్ కు ఆలయ పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికి, అశీర్వచనం చేశారు.

ఉదయం అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం అక్కడ నుంచి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత సీఎం రూ.1 కోటి తో తయారు చేయించిన అంతర్వేది ఆలయ నూతన రథాన్ని అంకితం చేశారు. నూతన రథం వద్ద  ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి.. భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు.40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.