FbTelugu

నేడు పోలవరానికి సిఎం జగన్

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఇవాళ సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు.
ఉదయం 11.10 –12 గంటల మధ్య పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తారు.

తన పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తన నివాసం తాడేపల్లికి సిఎం చేరుకోనున్నారు. సిఎం వెంట ఏపి జల వనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.