FbTelugu

రేపు ఢిల్లీకి సీఎం జగన్

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారు అయింది. లాక్‌డౌన్‌ తరువాత తొలిసారిగా జగన్ ఢిల్లీ వెళ్తున్నారు.

ప్రధానంగా శాసన మండలి రద్దు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ ప్రాజెక్టు లపై సంబంధిత మంత్రులతో చర్చించేందుకు అప్పాయింట్ మెంట్లు కోరారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు, గోదావరి పై తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.

You might also like