FbTelugu

ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ జరుగుతున్న 4 రాజ్యసభ సీట్ల పోలింగ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్పీకర్ తమ్మినేని కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేశారు.ఇవాళ ఏడు రాష్ట్రాల్లో 18 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటలవరకు ఈ పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.

You might also like