మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
అమరావతి: ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం వైఎస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిందిగా ప్రకాశం జిల్లా మంత్రులను సూచించారు. ఆ కుటుంబాలకు అండగా నిలవాలని మంత్రులకు స్పష్టంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు.
ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంలో కూలీలు దుర్మరణంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతులు అందరూ రాపార్ల గ్రామానికి చెందిన వారు. ఈ దుర్ఘటనలో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు. మొత్తం 11 మంది మృతి చెందగా తొమ్మిది మందిని గుర్తించారు.
ఇప్పటివరకు గుర్తించిన మృతుల వివరాలు
1.పీకా కొటేశ్వరమ్మ(50),
2.నుకతోటి లక్ష్మే(65),
3.కాకుమాను రమాదేవి(55),
4.కాకుమాను కుమారి(45),
5.కాకుమాను రాణిశ్రీ(40),
6.గోళ్ళ రవి శంకర్(20),
7.కాకుమాను శివ(17)
8.కాకుమాను మౌనిక(18)
9.కాకుమాను అమూల్య18).