FbTelugu

శివరాత్రి పూజల్లో సీఎం జగన్

కృష్ణా: ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వేంకటేశ్వర రావు గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న వేడుకల్లో జగన్ పాల్గొన్నారు.

శివ లింగానికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. జగన్ రెడ్డి వెంట టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని వెంకట్రామయ్య, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీఎం తో సెల్ఫీలు తీసుకునేందుకు మహిళా భక్తులు పోటీపడ్డారు. ప్రత్యేక పూజల తరువాత సీఎం తిరిగి తాడేపల్లికి ప్రయాణమయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.