FbTelugu

కంపెనీ యజమానిగా సీఎం వ్యవహరిస్తున్నాడు: నిమ్మల

అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యజమానిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ విషవాయువు లీకేజీ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమని ప్రశ్నించారు. ఈ ఘటనపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభావిత ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలన్నారు. వాటిలో పదేళ్లపాటు ఉచితంగా వైద్యం అందించాలని అన్నారు.

You might also like