FbTelugu

సీఎం, సీఎస్ కు బేడీలు వేయాలి: రేవంత్ రెడ్డి

ఎంగిలి మెతుకులు తింటున్న బీజేపీ, ఎంఐఎం

బీజేపీ, ఎంఐఎం మౌనముద్ర

హైదరాబాద్: సచివాలయంలో ఉన్న మసీద్, నల్ల పోచమ్మ దేవాలయాన్ని కూలగొట్టిన సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ లకు బేడీలు వేసి చర్లపల్లి జైల్లో పెట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డి అన్నారు.

సచివాలయంలో రెండు మసీదులు, ఒక గుడి కూల్చివేయడంతో రేవంత్ రెడ్డి ఇవాళ  నిప్పులు చెరిగారు. కేసీఆర్ వేసే మెతుకుల కోసం కక్కుర్తి పడ్తోన్న బీజేపీ నాయకులు నల్ల పోచమ్మ దేవాలయం కూల్చివేతపై స్పందించాలని డిమాండ్ చేశారు. దేవాలయం కూల్చివేతపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ లు తమ పార్టీ విధానాన్ని ప్రకటించాలన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒకే తానులో ముక్కలు అని ఆయన ఆరోపించారు.

ఉద్యోగ సంఘాల నాయకులను చెప్పుతో కొట్టాలి…

తెలంగాణ ఉద్యమానికి వేదికైన నల్లపోచమ్మ దేవాలయం, మసీద్ లను అమానుషంగా కూల్చటాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశ పడ్తున్నారు. సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మాధవరం నరేందర్ రావు అనే సన్నాసి హిందు మతానికి యజమాని కాదని ఆయన అన్నారు. మత విశ్వాసం ఉద్యోగ సంఘాలకు మాత్రమే సొంతం కాదన్నారు. ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వారు స్వాగతించడం సరైంది కాదన్నారు. ఉద్యోగ సంఘాలకి నరేందర్ రావు, ముస్లిం మతానికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వకల్తా ఏంటనీ రేవంత్ రెడ్డి ప్రశ్నంచారు. మందిర్, మసీద్ పేరుతో ఎంతో మంది ప్రాణాలు బలిగొన్నది మీరేనని బీజేపీ, ఎంఐఎం పార్టీలను తూర్పారపట్టారు. పోచమ్మ గుడి కూల్చివేతను సమర్ధిస్తోన్న ఉద్యోగ సంఘాల నాయకులను చెప్పుతో కొట్టాలని రేవంత్ రెడ్డి ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

పర్యావరణ అనుమతులు లేకుండానే…

పర్యావరణ అనుమతులు వచ్చిన తరువాతే సచివాలయాన్ని కూలగొట్టాలి. నగర శివారు జవహర్ నగర్ లో ఎలాంటి చెత్త వేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. సచివాలయ శకలాలు ఎక్కడ వేస్తున్నారో చెప్పాలన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పెడచెవిన పెట్టారన్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ శాశ్వత కట్టడాలు కట్టడానికి అనుమతులు లేవన్నారు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కేటీఆర్ ను సీఎం చేసేందుకే కూలగొట్టారు…

ఇవాళ తెలంగాణాలో బ్లాక్ డే అని రేవంత్ అన్నారు. కేసీఅర్ ఇతర మతాల విశ్వాసాలను ఆచారాలను దెబ్బతీస్తున్నారు. తన కుమారుడు కేటీఆర్ ను సీఎం పీఠంలో కూర్చోబెట్టేందుకు సచివాలయం కూల్చివేస్తున్నారన్నారు. సెంటిమెంట్ తప్పు కాదు, కానీ మూడ నమ్మకాలు మంచిది కాదన్నారు. వందల కోట్ల రూపాయలు వృథా అవుతుంది. అన్ని రకాల పర్యావరణ అనుమతులు లేకుండా ఎలా కూల్చుతారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాత్రి కి రాత్రే పడగొట్టలని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి లకు సీఎం కేసీఅర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసి… ఎవరినీ ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళకుండా చేసి నేటమట్టం చేశారని ఆరోపించారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు  సమీపంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయవద్దని సుప్రీం కోర్టు తీర్పు వుందని రేవంత్ రెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.