FbTelugu

బట్టలు ఆరేయబోయి షాక్ తో నలుగురు మృతి

* మృతులదంతా ఒకే కుటుంబం
మహబూబాబాద్ : బట్టలు ఆరేయబోయి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన దారుణ ఘటన జిల్లాలోని ఆమనగల్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఆమనగల్ లో ఓ గృహిని ఉతికిన బట్టలను ఇనుప తీగపై ఆరవేస్తుండగా..

ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురైంది. పక్కనే ఉన్న కుటుంబీకులు ఆమెను కాపాడబోయి ఒకరి తర్వాత ఒకరు కరెంటు షాక్ కు గురై నలుగురు మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.