FbTelugu

సూర్యగ్రహణంతో ఆలయాల మూసివేత

హైదరాబాద్: రేపు రాహుగ్రస్త సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ఆలయాలను నేటి రాత్రి నుంచే మూసివేయనున్నారు. ఈ సూర్యగ్రహణం రేపు(ఆదివారం) ఉదయం 10:18 గంటల నుంచి మధ్యాహ్నం 1:49 వరకు ఉండనుంది.

ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్తానాన్ని నేటి సాయంత్రం (రాత్రి 8 గంటల తర్వాత) నుంచే మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్వామివారికి ఏకాంతంగానే పూజా కాంకర్యాలు నిర్వహించనున్నారు. నేటి రాత్రి నుంచే కాణిపాకం, పద్మావతి అమ్మవారి ఆలయాలను మూసివేయనున్నారు.

You might also like