FbTelugu

21న కాణిపాకం ఆలయం మూసివేత

చిత్తూరు : ఈ నెల 21న కాణిపాకం ఆలయాన్ని మూసివేయనున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. ఆ రోజు సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. 20 వ తేదీన రాత్రి 9:30 గంటలకే ఆలయాన్ని మూసివేయనున్నట్టు తెలిపారు.

తిరిగి 21వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు తెరవనున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం 3:30 గంటలనుంచి భక్తులను అనుమతించనున్నట్టు తెలిపారు.

You might also like