FbTelugu

తెలంగాణలో విద్యా సంస్థల మూసివేత

హైదరాబాద్: తెలంగాణలో మెడికల్ కాలేజీలు మినహా అన్ని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మార్చి 24వ తేదీ నుంచి అమలులోకి వస్తుందన్నారు.
అసెంబ్లీలో సబితా రెడ్డి మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపటినుండి (24.3.2021) తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఆమె తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు మూసివేయక తప్పడం లేదన్నారు.

తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థలను మూసివేశాయి. పొరుగు రాష్ర్టాలలో విద్యాసంస్థలు మూసివేసినందున తెలంగాణలో కూడా విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నామని ఆమె వివరించారు. అయితే ఆన్ లైన్ లో తరగతులు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.