FbTelugu

చిల్డ్రన్ వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం చిన్నారులపై అధికంగా చూపిస్తుందని వ్యాధి నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ గుణపాఠాలను పరిగణనలోకి తీసుకుని చిల్డ్రన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతులు ఇచ్చింది.
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ చిన్నారుల కోసం తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఇవాళ ప్రారంభించింది.

మూడు దశల్లో పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మే 13న అనుమతులు మంజూరు చేసింది. ఢిల్లీ ఏయిమ్స్ లో 2 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలపై కోవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందుకోసం 18 మంది పిల్లలను ఎంపిక చేసినట్లు ఎయిమ్స్ వర్గాల వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. జూన్ మూడో తేదీన ముగ్గురు చిన్నారుకు వ్యాక్సిన్ ఇచ్చామని, వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని పాట్నా ఏయిమ్స్ వైద్యులు తెలిపారు. శనివారం నాడు వీరికి యాంటీబాడీ టెస్టు నిర్వహించగా వృద్ధి చెందినట్లు రిపోర్టులు వచ్చాయని పేర్కొన్నారు. 28 రోజుల తరువాత సెకండ్ డోసు ఇవ్వాల్సి ఉంటుందని పాట్నా వైద్యులు వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.