FbTelugu

యుఎస్ లో కోవాగ్జిన్ క్లినికల్ పరీక్షలు

హైదరాబాద్: భారత్ బయోటెక్ తన కోవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగాలు అమెరికాలో ప్రారంభించింది. అమెరికా ప్రభుత్వ ఎఫ్.డి.ఏ అనుమతి కోసం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.

అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేయగా ఎప్.డి.ఏ తిరస్కరించిన విషయం తెలిసిందే. అత్యవసర వినియోగం బదులు బయోలాజిక్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు సమర్పించాలని సూచించింది. ఇందు కోసం కంపెనీ అమెరికాలో క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తోంది. అమెరికాతో పాటు కెనడాలోనూ విక్రయాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. కెనడాలో విక్రయ హక్కుల కోసం అక్యుజెన్ సంస్థ భారత్ బయోటెక్ కు 15 మిలియన్ డాలర్లు ముందుగానే చెల్లించింది. అత్యవసర వినియోగం కోసం కెనడాలోనూ దరఖాస్తు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.