FbTelugu

పాపం… వ్యాక్సిన్ వద్దని చెట్టెక్కాడు

భోపాల్: జనాలను వ్యాక్సిన్ భయం ఇంకా వెంటాడుతునే ఉన్నది. వ్యాక్సినేషన్ కేంద్రానికి భార్యతో కలిసి వెళ్లిన వ్యక్తి, వేయించుకోకుండానే భార్య ఆధార్ తో సహా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆపై ఎవరికి దొరక్కుండా చెట్టెక్కి కూర్చున్నాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లా పంగకాలన్ గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్థులకు వ్యాక్సిన్ వేసేందుకు వైద్య సిబ్బంది చేరుకున్నారు. కన్వర్ లాల్ అనే వ్యక్తి కూడా వేయించుకునేందుకు తన భార్యతో కలిసి వచ్చాడు.

భార్య వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధం కాగా భయాందోళనకు గురైన భర్త ఆమె ఆధారా కార్డును కూడా తీసుకుని వెళ్లిపోయాడు. ఈ చర్యతో ఆమె వ్యాక్సిన్ వేయించుకోలేకపోయింది. చెట్టెక్కిన ఆయన ఎంతకూ దిగిరాలేదు. సాయంత్రం వైద్యులు అతన్ని కిందకి దింపి కౌన్సిలింగ్ ఇవ్వగా తీసుకునేందుకు సమ్మతించాడు. మరోసారి నిర్వహించే వ్యాక్యినేషన్ లో వేయించుకుంటానని భార్యాభర్తలు చెప్పారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతున్నది. జూన్ 20న 692 మంది వేసుకోగా, జూన్ 23న 4,842 మంది మాత్రమే వేయించుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.