FbTelugu

ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీలో గొడవలు…ఇద్దరు మృతి

భోపాల్: బీజేపీ ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీలో గొడవలు జరిగి కాల్పుల వరకు వెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన దామోహ్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకున్నది.
బన్వర్ గ్రామంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ లోధీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రెండు వర్గాల మధ్య చిన్న పంచాయతీ జరిగింది. తీవ్ర కావడంతో రాళ్లు, కర్రలతో దాడులు, ప్రతిదాడులు చేసుకున్నారు.

తుపాకీ కాల్పుల్లో జోగేంద్ర సింగ్, రాళ్ల దాడిలో అరవింద్ జై చనిపోయారు. అరవింద్ ఎమ్మెల్యే మనిషి కాగా, జోగేంద్ర సింగ్ ఎమ్మెల్యే ఆహ్వానించిన అతిధి అని పోలీసులు వెల్లడించారు. కాగా ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే అక్కడ లేరని, బయట ఉన్నారని జిల్లా ఎస్పీ హేమంత్ చౌహాన్ తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై, హత్యకు కారణమైన వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.