FbTelugu

చిన్నారులకు వ్యాక్సిన్ పై క్లారిటీ

న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ కంపెనీ చిన్నారులకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు ఈ వార్తను చూసి మహానందపడిపోతున్నారు.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో వాస్తవం లేదని, తప్పుడు వార్త అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) నెత్తనోరు కొట్టుకుంటున్నది. గ్రేట్ న్యూస్, 12 సంవత్సరాలు పైబడిన చిన్నారుల్లో అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిందని, కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిందని ఈ నెల 8వ తేదీన ఒక ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ పై ఇప్పటి వరకు 27వేలకు పైగా లైకులు రాగా 6,500సార్లు రీట్వీట్ కావడం గమనార్హం. ఈ వార్త విపరీతంగా షేర్ కావడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నాలుక్కరుచుకుంది. ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించక తప్పని దుస్థితి ఏర్పడింది. 12ఏళ్లు నిండిన వారికి అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు నిండినవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారని, అది కూడా కొన్ని రాష్ట్రాల్లో అమలుకావడం లేదని తెలిపింది. యుఎస్ లో మాత్రం 12 నుంచి 15 ఏళ్ల మధ్య నున్న చిన్నారుల కోసం ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ తయారుచేసి మార్కెట్ లోకి విడుదల చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.