FbTelugu

ఏపీలో బ్రిటన్ వైరస్ సంగతి తేలలేదు: వైద్య శాఖ

అమరావతి: ఆంధ్రాలో ఇంకా బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తించినట్లు అయినట్లు ఇంకా నిర్థారణ కాలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషణర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 11 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను హైదరాబాద్ సీసీఎంబీ, పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపించామన్నారు.

వాటి ఫలితాలు వచ్చిన తరువాతే పాజిటివా లేదా స్ట్రెయిన్ వైరస్సా అనేది నిర్థారణ అవుతుందని, అప్పటి వరకు వేచి చూడాలన్నారు. బ్రిటన్ నుంచి ఏపీకి 1363 మంది వచ్చారని, ఇందులో 11 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. మరో 17 మంది ఆచూకీ లభించడం లేదన్నారు. ఈ 11 మంది నమూనాలను హైదరాబాద్, పూణే కు పంపించామని, నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని భాస్కర్ వెల్లడించారు. ఆ దేశం నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న 5784 మందిని గుర్తించామని, వారి నమూనాలను కూడా పరీక్షిస్తున్నామన్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.