FbTelugu

యూఎస్ లో ఫేస్ బుక్ పై దావా

  వాషింగ్టన్: తాత్కాలిక ఉద్యోగులు, హెచ్1బీ వీసాదారులకు ప్రాధాన్యతనిస్తూ.. ఫేస్ బుక్ అమెరికన్లపై వివక్ష ప్రదర్శిస్తోందంటూ అమెరికా న్యాయ విభాగం న్యాయస్థానంలో దావా వేసింది. ఫేస్ బుక్ ఉద్దేశ పూర్వకంగానే అర్హులైన అమెరికన్లకు మొండిచేయి చూపేలా నియామక విధానాన్ని రూపొందించిందని ఆరోపించింది.

సాలీనా 1.56 లక్షల డాలర్ల సగటు వేతనం చెల్లించే 2,600 ఉద్యోగాల కోసం అమెరికన్లను ఫేస్ బుక్ నిరాకరిస్తూ.. హెచ్1బీ వీసాదారులతో ఉద్యోగాలు భర్తీ చేస్తోందని తెలిపింది. అలాగే శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డులు కోరుకుంటున్న తాత్కాలిక వీసాదారులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ఆరోపించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.