FbTelugu

గోల్కొండలో సివిట్ క్యాట్ సంచారం

బంధించి జూ పార్క్ కు తరలింపు

హైదరాబాద్: నగరంలో రెండు వేర్వేరు చోట్ల అడవి జంతువులు కన్పించడంతో జనాలు ఉరుకులు పరుగులు పెట్టారు. కాటేదాన్ రోడ్డుపై చిరుత, గోల్కొండ ప్రాంతంలో సివిట్ క్యాట్ కన్పించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.

బుధవారం అర్థరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు గోల్కొండ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందనే వార్త వ్యాప్తించడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. తమ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందంటూ పోలీసులు, అటవీ శాఖ అధికారులకు ఫోన్లు చేశారు.

civit cat

పోలీసులు, అటవీశాఖ సిబ్బంది గోల్కొండ ప్రాంతానికి హుటాహుటిన చేరుకుని దాన్ని వెతికే పనిలో పడ్డారు. ఒక ప్రాంతంలో దాన్ని చూసిన సిబ్బంది, చిరుత కాదని సివిట్ క్యాట్ (మాను పిల్లి) అని నిర్థారణకు వచ్చారు. ఈ విషయాన్ని మైకుల ద్వారా తెలియచేసి ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేశారు.

సివిట్ క్యాట్ (మాను పిల్లి) అనే జంతువు అక్కడ కనిపించిందని అటవీశాఖ అధికారులు ప్రకటించారు స్థానికుల సమాచారంతో అటవీశాఖ వెంటనే స్పందించి ఇవాళ ఉదయం దానిని బంధించామని తెలిపారు. నెహ్రూ జూపార్కు కు తరలించి తగిన రక్షణ చర్యలు తీసుకున్నామని జూపార్కులో దాని ఆరోగ్యాన్ని పరిశీలించిన మీదట తదుపరి చర్యలు తీసుకుంటామని పీసీసీఎఫ్ ఆర్. శోభ వెల్లడించారు. స్థానికులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

You might also like