FbTelugu

సివిల్స్ ర్యాంకర్ సమస్య కీ  క్షణాల్లో పరిష్కారం….కేటీఆర్

తెలంగాణ పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో ఓ సివిల్స్ ర్యాంకర్ సమస్య కీ  క్షణాల్లో పరిష్కారం ఇచ్చారు . వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ శ్రీజ ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 20వ ర్యాంక్‌ సాధించారు.ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రితో కలిసి మంగళవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అనేక పరిమితులు ఉన్నప్పటికీ అత్యంత ప్రతిభా పాటలతో విజయం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచావంటూ కేటీఆర్‌.. శ్రీజను ప్రశంసించారు.

మీ తల్లిదండ్రులు ఏంచేస్తారని మంత్రి అడగ్గా… తండ్రి ప్రైవేటు ఉద్యోగి అని, తల్లి ప్రభుత్వ ఆరోగ్యశాఖలో ఏఎన్‌ఎంగా వరంగల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. మీరుండేది హైదరాబాద్‌లో.. అమ్మ రోజూ వరంగల్‌కు వెళ్లి పనిచేస్తున్నారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఆమె బదిలీకి విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని శ్రీజ కేటీఆర్‌కు చెప్పారు. దీంతో ఆ విషయం తాను చూసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం శ్రీజ ఇంటికి వెళ్లేసరికి తల్లి హైదరాబాద్‌కు బదిలీ అయిందన్న సంతోషకరమైన వార్త అందింది. దీంతో ఆ కుటుంబం కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.