FbTelugu

సివిల్స్ ప్రిలిమినరీ కూడా వాయిదా

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యు.పి.ఎస్.సి) ప్రకటించింది.

వైరస్ కారణంగా ఈ ఏడాది జూన్ 27వ తేదీ జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ విషయాన్ని అభ్యర్థులు పరిగణనలోకి తీసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని సూచించింది. ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ తో పాటు కేంద్ర సర్వీసులకు యు.పి.ఎస్.సి సివిల్స్ పరీక్షలు నిర్వహిస్తుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.