FbTelugu

ఫేక్ ప్రొఫైల్ పై సివిల్ టాపర్ ఫిర్యాదు

ముంబై: సివిల్ సర్వీసు లో 93వ ర్యాంకర్ గా నిలిచింది. అంతకు ముందు ఆమె మిస్ ఇండియా. అయితేనేమి ఆమె పేరు మీదు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్ రూపొందించారు. నిజమేనని పలువురు స్పందిస్తున్నారు.

ఈ విషయం తెలియడంతో ఆమె అవాక్కయింది. ఆమె ఎవరో కాదు మొన్న వెలువడిన యూపీఎస్సీలో 93వ ర్యాంకర్ ఐశ్వర్య శోరాన్. తన ప్రొఫైల్ తయారు చేసి ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచారంటూ ఆమె ముంబై పోలీసుకు ఫిర్యాదు చేసింది. సుమారు
ఫేక్ ఇన్ స్టాగ్రామ్ ఖతాల్లో తన ఫొటోలు, వివరాలు పొందుపర్చారని ఆమె పోలీసులకు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే శోరాన్ కు ఇంత వరకు ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా లేదు. గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు ప్రొఫైల్ రూపొందించినట్లు శోరాన్ ఫిర్యాదు చేశారని, సెక్షన్ 66 కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

You might also like