FbTelugu

అభివృద్ధి కోసమే కోడ్ లేదు: మంత్రి నాని

కృష్ణా: రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదనే త్వరగతిన ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వేంకటేశ్వర రావు (నాని) వ్యాఖ్యానించారు.

జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను హైకోర్టు వాయిదా వేయడం పై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఎన్నికలకు భయపడి పారిపోయిన టీడీపీ, ఓడిపోతామని తెలిసి నామమాత్రపు స్థానాల్లో పోటీ చేస్తున్న బిజెపి, జనసేన లు ఎన్నికలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై, బుధవారం (రేపు) హౌస్ మోషన్ పిటిషన్ వేస్తామన్నారు. డివిజన్ బెంచిలో ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తున్నామన్నారు. హౌస్ మోషన్ పిటిషన్ లో 21 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినా, తాము సిద్ధమని మంత్రి నాని స్పష్టం చేశారు

You might also like

Leave A Reply

Your email address will not be published.