FbTelugu

పెద్ద నాయుడు, చిట్టి నాయుడికి అధికారం కల్ల: కొడాలి నాని

అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి కొంత మంది పనిచేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు.

ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగదని, తండ్రి రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి పై ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర ఉందన్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో నివాసం ఉంటున్న చంద్రబాబు ఆరు నెలలకో మూడు నెలలకో ఇక్కడికి చుట్టపు చూపుగా వస్తారన్నారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు దీక్షలు చేస్తారని, ప్రజల కోసం కాదన్నారు. బీజేపీ, జనసేన రాష్ట్రం లో ఉనికిలో లేని పార్టీలు, జనాధరణ కూడా లేదని కొట్టిపారేశారు. తిరుపతి ఉపఎన్నికల్లో బిజెపి కి ఎన్ని ఓట్లు వచ్చాయో అందరూ చూసారని, ఎంత దారుణంగా ఓడిపోయారో తేలిందన్నారు. బిజెపి నేతల మాటలు తప్ప ప్రజల్లో వీసమెత్తు బలం కూడా లేని పార్టీ అని నాని విమర్శించారు. రాష్ట్రంలో టిడిపి ని తొక్కి రావాలని బిజెపి చూస్తుందన్నారు. అందుకే టిడిపి, బిజెపి అలయన్స్ పార్టీలు పోటీపడి దీక్షలు చేస్తున్నాయని చమత్కరించారు. బిజెపి అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో మేము లెక్కలు తియ్యగలమని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.