FbTelugu

సివిల్ వివాదం.. సీఐ, ఎస్సై సస్సెన్షన్

ఏసీపీకి ఛార్జ్ మెమో జారీ
భువనగిరి: భూమి యజమానికి కాకుండా తప్పుడు పత్రాలు తయారు చేసిన వ్యక్తులకు మద్ధతు పలికి వేధింపులకు గురిచేసిన చౌటుప్పల్ పోలీసు స్టేషన్ సీఐ, ఎస్సై ని రాచకొండ పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. ఏసీపీకీ ఛార్జ్ మెమో జారీ చేశారు.

చౌటుప్పల్ మండలం తాళ్ల సింగారం గ్రామంలో గౌరిభట్ల సురేందర్ కు సంబంధించిన 2.33 ఎకరాల భూమిపై వివాదం ఉంది. ఇరువర్గాలకు చెందిన వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరించడంతో సురేందర్ భువనగిరి కోర్టులో పిటీషన్ వేశారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ సీఐ సీహెచ్.వెంకన్న గౌడ్, ఎస్సై నర్సయ్య అమలు చేయకుండా బెదిరింపులకు గురి చేశారు.
ఈ విషయాన్ని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ కు ఫిర్యాదు చేయగా, ఆయన విచారించారు. సురేందర్ చేస్తున్న ఆరోపణలు వాస్తవమని తేలడంతో సీఐ వెంకన్న గౌడ్, ఎస్సై నర్సయ్యను సస్సెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఏసీపీ సత్తయ్యకు ఛార్జ్ మెమో ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.