FbTelugu

రేపటి నుంచి సిటీ బస్సులు?

హైదరాబాద్‌: మహా నగరంలో ఆర్టీసీ బస్సులు బుధవారం నుంచి తిరగనున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఇవాళ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ బస్సుల పునరుద్ధరించే అంశంపై సుధీర్ఘంగా చర్చించారు. ఏకాభిప్రాయం మేరకు బుధవారం నుంచి నగరంలో సిటీ బస్సులను పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 5 గంటల నుంచి విధుల్లో చేరాలని సిటీలోని 29 ఆర్టీసీ కార్మికులకు డిపో మేనేజర్ల ఆదేశించినట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా నగరంలో 80 రోజులుగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా జిల్లాల్లో  బస్సులను అనుమతించినప్పటికీ హైదరాబాద్ లో అనుమతించలేదు.

You might also like