FbTelugu

సీఎం జగన్ ను కలవనున్న సినీ ప్రముఖులు

అమరావతి: ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ పలు సమస్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఈ భేటీలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ తదితర ప్రముఖులు పాల్గొననున్నట్టు సమాచారం. వీరు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3:00 గంటకు సీఎంతో భేటీ కానున్నారు.

You might also like