FbTelugu

ఓటేసిన సీనీ ప్రముఖులు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పోలింగ్ లో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పలువురు వరుస క్రమంలో నిల్చుని ఓట్లు వేశారు.

జూబ్లీహిల్స్ లో నటుడు నాగార్జున అక్కినేని, ఆయన భార్య అమల, ఫిల్మ్ నగర్ క్లబ్ లో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, నటీమణి లక్ష్మీ మంచు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ దంపతులు ఓటు వేశారు. అదే విధంగా హీరో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. నాలుగో తేదీన ఫలితాలు ఎలా ఉంటాయోనని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్యతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.