FbTelugu

రోడ్డుపై సిగరెట్‌ పారేశారంటే..

మన దగ్గర ఎక్కడపడితే అక్కడ సిగరెట్టు తాగడం. వాటిని ఆర్పకుండా అక్కడే పడేయడం సర్వసాధారణం. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగవద్దని ప్రభుత్వం చెబుతున్నా దానిని పట్టించుకునే వారి సంఖ్యే ఎక్కువ. కానీ, ఆస్ట్రేలియా మాత్రం ఈ పప్పులు ఉడకవు. వారు జరిమానా కట్టాల్సిందే.

ఆస్ట్రేలియాను కార్చిచ్చు దహించివేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వాన దేవుడు కరుణించి అనేక ప్రాంతాల్లో కురవడంతో ఆస్ట్రేలియాలో పరిస్థితి కొంత మామూలు స్థితికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఆస్ట్రేలియా ప్రభుత్వం మంటలను అదుపు చేయడం కోసం అనేక చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా వాహనదారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కారులో వెళ్తూ సిగిరెట్‌ను ఆర్పకుండా ఎవరైనా రోడ్డుపై పడేస్తే వారికి ఐదు డీమెరిట్‌ పాయింట్లను విధిస్తామని తెలిపింది.

కార్చిచ్చు కారణంగా ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాల్లో టోటల్‌ ఫైర్‌ బ్యాన్‌ను అమలు చేస్తోంది. అంటే.. బహిరంగ ప్రాంతాల్లో ఏ ఒక్కరూ నిప్పుకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదు. టోటల్‌ ఫైర్‌ బ్యాన్‌ అమలులో ఉన్న సమయంలో.. సిగరెట్‌ ఆర్పకుండా రోడ్డుపై పడేస్తే వారికి 11 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్ల(రూ. 5 లక్షల 37 వేలు) జరిమానా విధిస్తామని, డీమెరిట్‌ పాయింట్లను సైతం ఐదు నుంచి పదికి పెంచుతామని న్యూ సౌత్‌ వేల్స్‌ అధికారులు స్పష్టం చేశారు. జనవరి 17 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపారు. ఎవరైనా సిగరెట్‌ ఆర్పకుండా రోడ్డుపై పడేస్తూ కనిపిస్తే.. 1800 679 737 నెంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పాలని రూరల్‌ ఫైర్‌ సర్వీస్‌ అధికారులు కోరారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More