FbTelugu

శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణ

హైదరాబాద్: శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సీఎం స్పష్టం చేశారు.

సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

You might also like